ఓంకారమూర్తి
ఓంకార మూర్తివై వ్యోమకేశుండవై
చైతన్య మూర్తివై చెలగినావు
ఆనంద మూర్తివై నంబికా నాథుడై
ఆనంద తాండవం.బాడినావు
వామదేవుండవై వాసుదేవాత్మయై
పణిభూషణుండవై పరిగినావు
భస్మాంగ రాగివై భవరోగ వైద్యుడై
భక్తాళి నెల్లను బ్రోచినావు
ఆ.వే నీదు మహిమ.లెన్న నేనెంత వాడను
కరుణ జూప వయ్య గరళకంఠ
ఆర్తితోడ నిన్ను ననునిత్యమీరితి
ప్రార్తినంబు చేయుభక్తినిమ్ము
వందనాలు వేల వందనాలుఋ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి