అంజనానందనా-ఆనందమూర్తి
అంజనా నందన నానంద మూర్తియౌ
కపివరుండెపుడు కాచు మనల
శతయోజనాలున్న సాగర మంతయు
లంఘించి నతడంత లఘువుగాను
ధృతియును మతియును ధృష్టియు ధాక్ష్యంబు
భక్తవరులకిచ్చి భయముబాపు
సీత జాడతెలిపి శ్రీరామ కార్యంబు
సంపన్న మొనరించు సాహ సుండు
ఆ.వే.రామ కావ్య మనెడు రత్నంపు హారాన
వెలుగు జిలుగు లిచ్చు వేల్పుతాను
రామభక్త సరసి రాజహంసమతడు ఎంత
అతని కతడె సాటి యఖిల జగతి
(రచన;--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
వ్యాదినిర్మూలన వాయునందనుపాలు
రావణవధయంత రాము పాలు
లంఖిణినేమార్చి లంకనుగెలిచిన
హనుమంతునకేది హద్దు యింక
సంజీవినినితెచ్చి సౌమిత్రి బ్రతికించు
అంజనీసుతుడంత నండనుండ
మనకేమి భయమింక మధన పడగ
శ్రీరామ దూతయే శ్రీరామ రక్షగా
మనచెంత నుండగా భద్రమింక
ఆ.వె.రామ కథలోని రమ్యమౌ రత్నమా
వందనాలు నీకు వాయు పుత్ర!
నెరను నమ్మి నాను నీవేశరణమంచు
కావు వలయు జనుల కరుణ తోడ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
పవనసుతడెపుడు ప్రక్క నుండ
మాకింక కొరతేమి మచ్చుకైననులేదు
అంజనాసుతుడంత నభయ మొసగ
మాకేమి లేక్కొయి మహిని సుమ్ము
మనొజవుండతడోయి మారుతతుల్యమౌ
వేగమ్ముతోతానువిజయమిచ్చు
బలమును బుధ్ధియు వాక్పుటత్వమొసగు
నిర్భయతనొసగు నిపుణు డతడు
కాంచనాద్రి సముని కమనీయ విగ్రహు
ధైర్యమొసగు నతడు శౌర్య మూర్తి
ఆచరించవలయు యంజనా సునునకు
వేల వందనాలు వేడు కోలు
(రచన:-- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి