కార్పొరేట్ వైద్యం

అవధూత యనుకోకు యఖిలమ్ము కోల్పోయి
దిగులుపడినయట్టి దీనుదితడు
ఆశవసనమాయె యాశలేయడుగంటె
ఏమిమిగలదాయె యేడ్పుదక్క
కార్పేరేటువలలో ఖరీదైన వైద్యమ్ము
చివరకేమిమిగులు చింతదక్క
కాసుకక్కువరకు కాయంబు నివ్వక
బాధించు టెంతయో ప్రబలమాయె
ఆ.వె.సేవయనెడి మాట చెట్టెక్కి పోయగా
వైద్యవిద్య కున్న విలువలన్ని
వలువ లట్లు విప్పి హొయలొలకబోయి
కాని కాలమొచ్చె కడకు మనకు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత