గంగావతరణం
అవనికేతెంచెగా నధ్భుతంబౌరీతి
విష్ణుపాదోధ్భవి వినుత కీర్తి
నందినీ నామమా నందమందివ్వగా
నళినాక్షుపుత్రియై నళినికాగ
శీతాంశుశోభతో సీతయనుఖ్యాతి
మాలినినామంబు మహనీయమౌరీతి
పావనంబులకెల్ల పావనమ్ము
భాగీరథాఖ్యతో భాగ్యంబు గూర్చగా
చరితార్థమాయెమా జన్మ మంత
ఆ.వే.పాపరాశినంత భస్మంబు గాజేసి
ముక్తి నొసగు తల్లి భక్తి తతికి
గంగగంగ యనుచు గానంబు చేయగా
అందు కొందు వీవుయనఘ చరిత
హరిపద పాద్యమై హరునిశిరమునెక్కి
దుండుకుదనముతో దుమికి దుమిక
ఉరవళ్ళు పరవళ్ళునుర్వికేలంచును
శిగలోన బంధించె శివుడు తానె
పరమేశు ప్రార్థించె భగీరథుడంతట
వెల్లువై వరదయై వెడలె గంగ
జహ్నుని జన్నమ్ము జలములో ముంచేసి
జహ్నుకరుణచేత జాహ్న వాయె
ఆ.వె. జలధిలోనచేరి సగరపుత్రులనెల్ల
ముక్తినొగినట్టి పుణ్యమూర్తి
నిన్ను పొగడ గలడె నీరభవుఢైన
గంగకెవరుసాటిగంగ కొన్ని
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి