మదిలోనిమాట

మదిలోన మెదిలేటి మాటల నెల్లను
పద్యరూపంబున పదిలపరుప
మనసుకలిగెనాకు మమకారభావమే 
మరులుకొనినయట్లు భవ్యరీతి
పద్యంబు హృద్యమై బ్రతుకంత ధన్యమై
పదికాల ములపాటు పద్యమందు
ఆంధ్రభాషయనిన నందమౌ పద్యమే
ఇలలోన మనకెల్ల యింద్ర పదవె
ఆ వే.పద్య రచన చేయ పరమోత్సవంబట్లు
నిత్య పద్య రచన నిర్ణయంబు
అమ్మ.దయను వేడి హర్షంబుతోనంత
రచన చేయుదు నింక రక్తి మీర
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత