జగద్గురువులు

శృంగేరి నామమ్ము శృతిబధ్ధమైనంత
అధ్యాత్మభావంబు నంకురించు
వేదాలు శాస్త్రాలు వేదాంత తత్త్వంబు
వేద్యంబు చేసేటి వేదికిదియె
చంద్రమౌళీశ్వర సందర్శనంబంత
సమకూర్చు మనకంత శాంతి సుధలు
శారదా దేవియే సర్వంబు మనకిచ్చు
వాంచితార్థములను వరుసతోడ
ఆదిశంకరులిచట నాధ్యాత్మ శక్తితో
గురురూప లైనట్టి గురుతు యిదియె
అ.వె.౹౹౼పూర్వ జన్మలోన పుణ్యంబు నీకున్న
శృంగ గిరిని నీవు చూడగలవు
అమ్మదయుయె నీకు నాధ్యాత్మ శక్తినీ
అహరహముననీకు నందగలదు
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత