నా అభిమాన నేత
రాయలేలినసీమరత్నాలసీమలో
నీలంపురత్నమై నిలిచెనిటుల
వజ్రాలగనులున్న వజ్రాలసీమలో
రత్నమై మెరిసిన రైతుయితుడు
వజ్రకరూరులోవజ్రాలు దొరుకుటె
కొత్తేమికాదయ్య పాతమాటే
హేమంపుగనియున్న రామగిరిలోన
పసడిపంటయటుల పండగలవు
ఆ.వె.ఆటుపోట్లునెల్లయాటలో భాగంగా
గణన చేసినట్టి గట్టివాడు
పదవివలనగాక ప్రతిభచే పదవికి
వన్నెవాసి తెచ్చు వ్యక్తి నేత
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి