అద్వైత తత్త్వము తెలుగు కవులు
ఆద్వైత తత్త్వాన్ని యాదిశంకరులిచ్చి
కైలాసమేగెను కాంక్షతీర
నన్నపార్యుండంత యారాజమార్గాన
భవ్యమౌరీతిగా పాటుపడియె
ఉభయకవిమిత్రండు నున్నతా దర్శియై
హరిహార తత్త్వంబు యవనికిచ్చె
శంభుదాసుదతడు సధ్భక్తి సృజియించె
హరివంశ రచనంబ త్యధ్బుతమ్ము
భాగవతసుధలు పరమామృతమట్లుగా
పోతన్న పసిడిగా పోసె మనకు
ఆ.వే.ఆంధ్ర భాషలోన నద్వైత తత్త్వంబు
తెలుగు కవులు బాగ తెలియ బరచి
మనకునందజేయు మధురఫలమలయ్య
భావి తరము కివ్వ భద్ర మగును
(రచన: విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి