బమ్మెర పోతన
పలికెద నీనోట భాగవతంబంత
పలుమాటలేల పల్కు మింక
పరమార్థ మిదియేను పరిపూర్ణ.మౌజన్మ
భాగవతముకన్న భాగ్యమేమి
పదము పదములోన పరమార్థ తత్త్వంబు
పలుకు పలుకులోన పలుకు తీపి
రాయవలయునీవు రసరమ్యమౌరీతి
తేటతెనుగులోన తేనె లొలుక
ఆ.వే. అనుచు నిలిచిరయ్య యాదిదంపతులిట్లు
పోతరాజుముందు పొల్లుబోక
భాగ్య మన్న నీది బమ్మెరగ్రామమా
నిలిచె నీదు చరిత నిండుగాను
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి