వైవాహికోత్సవ వైపరీత్యమిదియె

వైవాహికోత్సవ వైపరీత్యమిదియె
సాలుకోసారిగా జరుగుచుండు
అమ్మోరు పూనిన  యార్భాటమట్లుగా
తనలోని కసినంత తానుచూపు
గ్రహచార మీరితి గర్జించినట్లుగా
పొరబాటు కీరీతి పొగలి యేడ్చు
ఆర్ధాంగిరూపాన యవతారమందిన
కాళరాత్రి యనుచు కలతచెందు
ఆ.వె‌ మూడుముక్క లాట ముక్కలో ముక్కైన
తాను గెలుచుననచు తలచు భర్త
చెళ్ళుచెళ్ళమనుచు చెర్నాకొదెబ్బయె
సుంత శాంతి నిచ్చు సుద్దియాయె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత