శ్రీకాళహస్తీశ్వరా!

తంతువాయమొకటి తంతువులల్లచూ
ఆలయంబునుకట్టె యధిక భక్తి
అర్చనంబేదిరాయష్టమూర్తికనుచు
కావించె పూజను గజముతాను
మణులతో కావింతు మండనంబనుచు
పరమేశుకర్పించె పాము మణిని
చుట్టాలు పక్కాలు చూచువారెవరని
చింతించె దిగులతో చెంచుతాను
ఆ.వె.కన్నులొసగు నట్టి కన్నప్ప శివభక్తి
కనులవిందుచేయుకథలు చూడ
భక్తివలయుమనకు భగవంతు మ్రోలను
ముగ్ధభక్తికతడు మురసిపోడె
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత