మగవాడి బ్రతుకు

చిరుతవయసులోనచిన్నవాడనితల్లి
నోరుమూయమనుచునొక్కిచెప్పు
పరిణయమైనంత భార్య పతినిమీకు
ఏమితెలియదంచు యెరుకజేసె
ముదిమిమీదపడినంత మురిపాన పిల్లలు
నాన్నకేమితెలుయు నానమనిరి
తెలిసినవయసెదొతెలియనివయసెదొ
తెలియకుండగనిట్లు తెల్ల వారె
ఆ.వె.బ్రతుకు పొత్తమందు మగవాని జ్ఞానమ్ము
శేష ప్రశ్నమాయె చివరికిట్లు
మౌన వ్రతముకంటె మోదమ్ము సమకూర్చు
తెలివి నొకటి నేను తెలుసుకొంటి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత