సద్దాంహూసేన్ -వీరాధి వీరుడు
వీరాధి వీరుండు శూరాధి డతడోయి
అసమానతేజుండు నాఢ్యుడతడు
అగ్రరా జ్యాభిజాత్యంబును నెదిరించి
మీసమ్ము దువ్విన మేటి మగడు
భారతీయ లనిన బంధుభావంబుతో
స్మేహహస్తముచాచు స్మేహశీలి
కుటిలమౌ బుధ్ధితో కౄరకృత్యంబుతో
ఉరికంబమెక్కగా నూహసేయ
ఉరికొయ్య కాసంత నులికిపడునేమొ
మరణభయములేని మర్త్యుడతడు
అమర జీవి యతడు ననితర సాధ్యండు
మరణ భయము లేని వీర వరుడు
ప్రజల గుండెలందు పదిలమౌ గుర్తుగా
నిలచినాడు యితడు నిజముగాను
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి