మేరా నామ్ జోకర్
మేరా నామ్ జోకర్ ఒక నీడివైన చిత్రం కాదు. అది ఒక దృశ్యం ప్రబంధము.అందులోని ప్రతి దృశ్యము,ప్రతిగీతము,ప్రతిసంభాషణ, దర్శకత్వము అమోఘము.ఒక విదూషకుని జీవితంలో కరుణారసము హస్యరసములు పక్కపక్క నే సమకూర్చడం జరిగింది. (,విరుధ్ధరసముల సమ్మేళనం చార్లీ చాప్లిన్ లో తరువాత రాజకపూర్ కే కుదిరింది.కే.యే.అబ్బాస్ రచనకు పూర్తీ న్యాయం జరిగింది. దర్శకత్వం ప్రతిభకు ఒక తార్కాణం.మూడవ పార్ట్ లో రాజకపూర్ చేతిలో Life magazine, పద్మిని చేతిలో time magazine, రాజేంద్ర కుమార్ చేతిలో fortune magazine లు పెట్టి కథను సూచార్యర్థ సూచనచేశాడు.సినిమా మెదటలో ❤️ ను చూపించి అది ఎన్లార్జ్ అయినట్లు చూపడం గొప్ప సింబాలిజం. టీనేజ్ లవ్ లో వుండే వ్యామోహాం infatuation ను నిర్మాణాత్మకంగామార్చడం మనోజ్ కుమార్ ద్వారా చిత్రించడం రసజ్ఞల హృదయాలను చూరగొంటుంది.
"ఫహలా ఘంటా బచ్ పన్ ,దూసురా జవానీ,తీసర్ రా భూడాపా" ఓహ్ ! ఆ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే .ఆ సినిమాను దాదాపు 20 సార్లుకు పైగా చూచే వుంటాను. హసరత్ జైపురి,శైలేంద్ర గీతాలు సాహితీ పరంగా గొప్పవి .అలానే శంకర్-జైకిషన్ లు తెలుగువారికి బాగాళతెలిసిన వారే
1969-70:ప్రాంతాల్లో వచ్చిందనుకొంటా ! ఆ ప్రవాహంలో కొట్ఠుకుపోయి విద్వాన్ లో నా నాలుగు సబ్జెక్ట్ లు కొండెక్కాయి.తరువాత గట్టెక్కెను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి