కాశీ గంగ

ఉపాధ్యాయులను విద్యార్థులు నిశితంగా పరిశీలిస్తారు.వారు ఉపాధ్యాయులు చెప్పిన దానిని  ప్రయోగశీలంగా పరిశోధించి నమ్ముతారు .గుడ్డిగా దేనిని నమ్మరు‌ .ఈ సంఘటన 1997 ప్రాంతంలో జరిగింది.9వతరగతి తెలుగువాచకంలో  శ్రీనాథ మహాకవి విరచిత భీమఖండంలోని వ్యాస అగస్త్య సంవాదంలోని కాశీపట్టన విశిష్టత పాఠము.
పాఠం చెప్పెటప్పుడు గంగానది పరిశుధ్ధమైనది. సూక్ష్మక్రిములు పెరగవు. అనిచెప్పి, ప్రయాగలో గంగానది నీరును పెట్టుకొన్నాను.పట్టుకొన్నప్పుడు.ముందు  మడ్డిగా వున్నా 10,15 నిమిషాల్లో స్వఛ్ఛంగా మారింది, ప్రస్తుతం మా యింట్లో ఆ గంగోదకమే వుందని చెప్పాను.
ఆ తరువాత ఆ విద్యార్థి తదనంతరం హోటల్ మేనేజ్మెంట్ కోర్సు తీసుకొని కాశీలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఒకరోజు వర్షాకాలంలో  తేనీటి రంగులోనున్న గంగను పరిశీలించాలని అనుకొని ,గంగను పెద్ద సీసాలో పట్టుకొని తన హాస్టల్ కి తీసుకొని  వెళ్ళిచూచాడు.అప్పటికే ఆనీరు స్వఛ్ఛంగా మారిపోయినవిషయం గమనించాడు.తరువాత కోర్సుఫూర్తియైన తరువాత  ఆ గంగోదకంలో కొంత భాగం నాకిచ్చి" సార్! మీరు చెప్పింది నిజం .నేను కాశీలో గంగను సేకరించాను‌.అన్నాడు.
అబ్బాయి! కాశీలో కాక హరిద్వార్ లోనో ప్రయాగలోనో గంగను పట్టుకోవాలి అని చెప్పాను.
ఇలా నా మాటలను గుడ్డిగా నమ్మకుండా పరిశీలించినందుకు సంతోషపడ్డాను

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత