దశవతారాలు
చేపవై వచ్చేవు చెడ్డరక్కుసుచంపి
వేదాలు కాచావు వేడ్కతోన
కూర్మమై వచ్చేవు కూర్మితో మోసేవు
మంధర గిరినంత మమతతోడ
కిటిరూప మెత్తేవు కీటడంచావంత
కనకాక్షునసురుని కాటికంపి
కంబాన వెలసేవు కనకకశిపుసుతు
కాచిన నరహరి కావు మమ్ము
వామనుడైనావు బలినంత కోరావు
మూడడగుల నేల ముచ్చ టొప్ప
భార్గవు డైనావు బాధించు రాజుల
పరలోక మంపావు బాధ్యతోప్ప
రఘురాముడైనావు రావణునదిమావు
ధర్మాన్ని నిలిపావు ధరణిపైన
హలముచేబూనావు హలికుడైనావు
బలరాముడైనావు బలిమి మెరసి
పార్థసారథి గాగ పరమార్థమెరిగించి
శ్రీకృష్ణు డైనావు చింత తీర్చి
అశ్వంబు నెక్కావు నసురుల తరిమావు
కల్కిగా వచ్చేవు కాల గతిని
ఆ.వే.సాధుజనుల కావ సత్యంబు నిల్పగా
ధర్మ రక్ష చేయ ధరణిలోన
అవతరింతు ననచు నభయమొసగినట్టి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి