జాతీయభావమే జాతీయ వాదము

జాతీయ భావమే జాతీయ వాదంబు
జాతిజనులకెల్ల జవము నొసగు
జాతీయవాదమే యతివాదమట్లుగా
జడిపించు తగదోయి చవటవోలె
వేలాది యేళ్ళుగా వేదాలు శాస్త్రాలు
మానవాళికినెల్ల మార్గ మొసగె
సంస్కృతీ సభ్యతా సంస్కారములనెల్ల
ఇతిహాసమంత యింపునింపె
భాగ్యమనగ నాదె భరతాంబ బిడ్డను
అమ్మవడిని బోలు యవనియంత
దేశభక్తితోడ దేహంబు ప్రాణంబు
ధన్యమగుని కాదె నాదుజన్మ
రచన::గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత