భరతమాత
వందనములుమాత వందనములు తల్లి
వర్ధిల్ల వలెనమ్మ భరతమాత
సుజాలు మాకిచ్చి సుఫలాలనందించి
మలయమారుతమెల్ల మాకునొసగి
పాడిపంటలతోడ పచ్చనౌ సీమంతం
మాకిచ్చినావమ్మ మమత తోడ
సౌఖ్యమ్ము నందించు సౌజన్య మూర్తిని
వరదాయివీవమ్మ వరములొసగ
ఆ.వె.భాగ్యమొసగునట్టి భరతాంబ యోడిలోన
పూర్వ పుణ్య గరిమ పుట్టినవాడు
తల్లిరుణముదీర్చు తరుణమ్ము యిదియేను
మాకు నొసగవమ్మ మరువకమ్మ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి