ఇలవేల్పు వలెలాంబ
కోడ్మూరుపురమునకోటికాంతులతోడ
విద్యాధి దేవత వెలసెనచట
ఇలవేల్పు వలెలాంబ యీప్సితార్థములిచ్చి
కనురెప్పయట్లుగా కాచునెపుడు
మోటప్పతాతతో మొదులెట్టి మాకెల్ల
వైదుష్యమొసగిన వేదమాత
తరతరములనుండి తప్పక మీకింక
అనధీతశాస్త్రంబునవగతమౌనట్లు
సామర్థ్యమిచ్చిన శారదాంబ
ఆ.వె.నీదు పదములంటి నిరతంబు ధ్యానించు
భక్తజనులకెపుడు భధ్రమొసగు
సరసిజాసనాది సురలోకవందిత
వేదవేద్యకివియె వందనాలు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి