గగనలింగము అరుణాచలము

పంచభూతమయుడు పశుపతినాథుడు
కొలుచువారికెపుడుకొంగుబసిడి
ఏకామ్రనాథుండు యేలుచుండుజగతి
పృథివితత్వంబున కృపజూచు
జంబుకేశ్వరమున జలలింగరూపుండు
ఆప్యాయమందించి యార్తిబాపు
భవభయములుబాప వాయురూపంబున
కాళహస్తీశుడై కాచునెపుడు
అగ్నిరూపుండుగా యరుణాచలమునందు
విశ్వాత్ముడైతానువెలసియుండు
ఆకాశలింగమైయంతట వ్యాపించె
చైతన్యమూర్తియౌ శివుడుతాను
ఆ.వె.పంచభూతమయడు పంచాక్షరీమంత్ర
సిధ్ధితో మనకిచ్చు సిధ్ధపదము
అతని యాజ్ఞలేకయణువైనకదలదు
చిత్తశుద్ధి యున్న శివుడుమెచ్ఛు
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ
 శాస్త్రి 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత