ప్రాంతీయ భావన - ప్రాణాంతక భివన
సంకీర్ణ భారతమున ప్రాంతీయ భావన
౧౧౧
కలగూరు గంపయే కంగాళి రాజ్యమ్ము
కప్పలతక్కడి కాకిగోల
ప్రాంతీయ దృష్టియే ప్రాబల్యమందగా
జాతీయ దృష్టికి జాడలేదు
బహునాయకత్వంబు బాహుళ్యమందగా
అభివృధ్ధియంతట యటక నెక్కు
ప్రాధన్యపదివికై ప్రాబల్య మెక్కువై
కుర్చీలకొరకునై కుమ్మలాట
ప్రక్కదేశమంత ప్రక్కలో బల్లెమై
అదను పదును చూసి యాక్రమించు
మతము భాషయంచు మమకారమునువీడి
దేశరక్షచేయ దీక్షవలయు
రచన.👌👌👌👌గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి