మాతృ దినోత్సవం

తల్లికడుపులోనతలదాచుకొన్నట్టి
జగతిజనులకెల్ల జన్మదినము
అమ్మయే లేకుండా యసలేమి కలదోయి
శూన్మమొకటిదక్క చూడ్కికింక
అమ్మలగన్నట్టి యమ్మయెయవనిపై
అనురాగమూర్తిగా. యవతరించె
ఊయ్యెల బడిలోన వుంగాలచదువుల
అమ్మయే నేర్పేటియాదిగురువు
అక్షరాభ్యాసాన యాశలహరివిల్లు
అమ్మకనులలోన యందగించు
ఆ.వే.తల్లి దీవె నంది తనయుడు జయమందు
మాధవుండు మెచ్చు మాతృభక్తి
ఇదియెసగుమనకునిహముపరములన్ని
నాగరాజు మాటనమ్మవోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత