మోహినీయవతారము
అమృతకలశమంతహస్తానధరియించి
మోహినీరూపాన మోదమొసగ
పాలకడలినుంచి పరమాధ్భుతంబట్లు
అవతరించినయట్టి నచ్యుతుండు
మంధరపర్వతమవలీల భరియించి
సురభాండమందించె సురలకెల్ల
ధన్వంతరీరూప ధ్యానస్వరూపమై
రోగాలనెల్లను రొష్టు పెట్ట
అవతరించినయట్టియచ్యుతుండు
పాలకడలి పట్టి పరిణయంబాడిన
మాధవుండితడని మాకుతెలుసు
ఆ.వె.అమరలోకమెల్లయానందమందగా
అమృతమొసగినట్టి యచ్యుతుండు
దుష్టశిక్షణంబు శిష్టరక్షణ సేయ
అవతరింతువీవు యవనిలోన
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి