దేశభక్తులు

స్వారాజ్య సమరాన సర్వంబు నర్పించి
బానిసత్వంబును బాపినారు
ప్రజలకొరకువారు ప్రాణంబులర్పించి
స్వాతంత్ర్యసమరంబు సల్పినారు
అట్టిదౌదేశంబు యవినీతి మయమాయె
బరువులేక మనకు  పనులుకావు
పదవిపొందుకొరకు పడరాని పాట్లుగా
వెధవవేషాలన్నివేశినారు
బంధుప్రీతి యంత ప్రబలమాయెనకట
లంచగొండి తనమె లక్ష్యమాయె
మంచిదనము నెంచ మచ్చుకైననులేదు
కానికాలమాయె గతము కన్న
రచన.గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత