పరమేశలింగము

ఆరుబయలునీకుయావాసమాయెగా
భుజకీర్తియాయెగా భూజమిట్లు
పంచభూతాత్మకా పశుపాశమోచకా
తంతువాయమెకటి తంతువులల్లుచు
దేవళంబుకట్టగా తెలిపెనేమొ
అభిషేకమొనరింతుయష్టమూర్తికనుచు
గజరాజు భక్తితో కాంక్ష పడెనొ
నాగేంద్రమెక్కటి నవరత్న మర్పింప
కాచియున్నదనుచు వేచినావొ
కన్నప్ప యడవంత గాలించి శోధించి
వెలగపండ్లకొరుకువెళ్ళెనేమొ
ఆ.వె.ముగ్ధభక్తికిట్లు ముగ్ధుడై తానిట్లు
వనములోననుండ వచ్చెనేమొ
ఎవరికెట్లుతెలియుయీశ్వర లీలలు
అతనినడగతరమె యతనిలీల
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత