రక్షక భటులు

కాఠిన్య మనుకోకు కారుణ్య భావమే
కనిపించు మనకంత కన్నులందు
అదలింపుయనుకోకు బెదరింపు లేదోయి
 రక్షించు వలెనంచు లక్ష్యమొకటె
ఇల్లాలు పిల్లల యింటికే వదిలేసి
నిద్రకు తిండికి నీళ్ళు వదలి
కఠినకరోనాను కట్టడి చేయగా
లాఠియే చేతిలో రక్షకాగ
అనునిత్యమీరితి యప్రమత్తతోవారు
మనరక్షకొరకునై మసలు చున్న
పోలీసు భాయికి భారమ్ము కాకుండా
సహకారమందించు సమయం మనుచు
ఆ.వె తలచు వలయు మదిని తాత్పర్య బుధ్ధితో
ఇల్లు వదల రాదు  యింకమీరు
కంటికాన కుండ కబళించు రోగాన్ని
గెలవ వలయు నంచు తలప వలయు
(రచన:--గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత