కాలభైరవ స్మరణ
కాలభైరవుండు కరుణార్ద్ర చిత్తుడు
కామితార్థ మొసగు కరుణజూపు
కోపగించెనేని కొంపముంచగలడు
శివుని నమ్ముకొన్న చింతబాపు
దక్షుడనగనేమి తాతయనగనెంత
తప్పు చేసినంత తలనుదీయు
ఆర్తితోడపిలువ నరుదెంచు నప్పుడె
భక్తితోడమెలగ ముక్తినిచ్ఛు
విశ్వనాథుకన్న వినయశీలమెసగ
కాలభైరవుణ్ణీ కనుముతొలుత
అతని యాజ్ఞ యున్న యన్నియుసమకూరు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి