పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాక్షి వ్యాసాలు

అనితర సాధ్యంబునత్యధ్భుతంబైన
సాక్షిరచననింక చదువరండి
వచనరచనలోని వైదుష్యమెన్నగ
దానికదియెసాటి తర్కసహము
నిత్యజీవితమున నిశితదృష్టిపరపి
లోటుపాట్లనుతెల్పు లౌక్యుడతడు
జంఘాలశాస్త్రిగా చంఢశాసనమున
అవినీతి కంపును యణుచుచుండు
మనుజలందుననున్న మాయరోగమునంత
జలజలా కడిగేయు జాణయితడు
ఆ.వె.సాక్షి వ్యాసమందు సకలంబు కలదంచు
విజ్ఞులన్నమాట వింత కాదు
అపరకాళి దాసు యపరషేక్స్పియరన్న
ఖ్యాతిపొందినట్టి ఘనుడుకాడె
(రచన;- విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత