ఓంకారమూర్తివై
ఓంకార మూర్తివై వ్యోమకేశుండవై
చైతన్యమూర్తివై చెలగినావు
ఆనంద మూర్తివై అంబికా నాథుడై
ఆనంద తాండవంబాడినావు
వామదేవుండవై వాసుదేవాత్మవై
కైలాసగిరినుండి కదలినావు
భస్మాంగరాగివై భవరోగ వైద్యుడై
భక్తాళి నెల్లను బ్రోచినావు
నీదు మహిమ నెన్న
నేనంత వాడను
కరుణ జూప వలయు.గరళ కంఠ
లింగరూపమందు లీనమౌనుజగతి
విశ్వ వంద్యు నీకు వినతి జేతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి