కనకదుర్గమ్మ కాపాడవమ్మ
ముసిముసి నవ్వుల భువనాలు మురిపించి
హాయిగా నవ్వించు యమ్మయిదిగొ
చదువుల తల్లియై చాత్రులనెల్లను
చదివించి నవ్వించు శారదాంబ
అన్నపూర్ణమ్మగా యాకలిపోగొట్టు
హాయిగానవ్వించు యమ్మయీమె
పేదవాడికరువుపేర్మితో పోగొట్టు
శ్రీలక్ష్మి గానవ్వుసిరులతల్లి
దుర్గమ్మతల్లియై దుష్టాత్ముదునుమాడి
హాయిగా నువ్వేటి యాద్యశక్తి
ఆ.వె.కదలిరాకదమ్మ కరుణించి కాపాడ
అమ్మకరుణకేమియడ్డమింక
నిన్ను నమ్మినాము నీకన్న దిక్కేది
చిరునగవునవ్వి చింతబాపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి