వేదానుశాసనము
"అస్వాధీనమ్ కధం దైవమ్
ప్రకారైరభిరాధ్యతే
స్వాధీనమ్ సమతిక్రమ్య
మాతరం పితరం గురుమ్!."
భావం.
ప్రత్యక్ష దైవాలు తల్లీ, తండ్రీ, గురువులూ !
వారిని విడిచిపెట్టి , సాధ్యం కాని దైవాన్ని
ఆశ్రయించడ మెందుకు ?!.
భావాను వాదం:--
.అమ్మ నాన్న గురులునతిదగ్గరుండగా
దేవుడేడ యనుచు దేవులాడి
తెలివి మాలినారు తెలివిలేని నరులు
నిజము చెప్పితంచు నింద వలదు
(గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి