బ్రహ్మవిద్య
బ్రహ్మ విదుడెపుడు బ్రహ్మమ్మె తానౌను
శంకింప పనిలేని సత్యమిదియె
సత్యంబు జ్ఞానంబు సబ్రహ్మరూపాలు
నిగమాలు తెల్పిన నిజము కనుము
ఆదియు నంతంబు నసలేమి లేనట్టి
బ్రహ్మాను భూతియె పరమ పదము
బుధ్ధికుహరమందు పూర్ణమౌ బ్రహ్మామున్
దర్శించు జన్మంబు ధన్యమోయి
ప్రభవించె సర్వమ్ము పరమాత్మ నుండియె
ఆకాశముననుండీ యనిల మొదవె
అనిలంబు నుండియె యనలమ్ము జనియెంచె
జ్వలనమ్ము నుండియె జలము కలిగె
జలమువలనకాదె జనియించె పృధివంత
ఉర్వినుంచివెడలె యోషుధులెల్లును
ఓషధులవలనె యోగిరమ్ము
భుక్తివలనకాదె పురుషుడు బ్రతుకును
ఆ.వె.బ్రహ్మ విద్య నంది బ్రహ్మాను భూతితో
సంచరించ జన్మ సఫల మగును
గురువు వలన కాదె గుప్తమౌ విద్యచే
పొంద వలయు మనము పూర్తిగాను
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి