గాజులొళ్ళ మర్యాద
"గాజులోళ్ళ మర్యాద"
ఇది అనంతపురం జిల్లా సామెత.
ముత్తైదువులు పవిత్రంగా భావించె మట్టిగాజులను అమ్మే వర్తకులు తమ వెంట జంభకాన ను వెంట తీసుకు వస్తారు. తాము తెచ్చుకొన్న గాజుల మలారాలను, లక్ష్మీ స్వరూపాలు గా భావించి,జంబకాన పై వుంచుకొంటారు.అలా తమకు తాము వస్తువుల ను గౌరవించుకోవడం గాజులోళ్ళ మర్యాద అయింది.
గ్రామసీమల్లో ఇదో అందమైన వేడుక .అమ్మలక్కల సండడి అదొ అందమైన ముచ్చట.
కొన్ని సార్లు అద్భుతాలు జరుగుతాయి.
దేవాలయం లో అమ్మవారు ఆ వూరి జమిందారుల యిలవేల్పు.
ఒకరోజు గాజులు వాడు జమిందారుల రాణివాసపు వనితలందరికి గాజులు
వేసారు.(ఆది పరదా చాటునే.) ఆ తరువాత ఇందరికి గాజులవేసాను,ఇంత సొమ్మైందని లెక్క చెప్పాడు.కానీ గాజుల వాని లెక్కకు జమీందారుగారి లెక్కకు లంకె కుదర లేదు.చర్చోప చర్చలు జరిగిన తరువాత కూడా విషయం నిగ్గుతేల లేదు.సరిగ్గా ఆ సమయంలోనే పూజగది నుంచి "నేనే గాజులు వేయించుకొన్నానని" అమ్మ వారి పలుకు వినపడింది.
అందరూ ఆశ్చర్యపోయారు.ఆ గాజుల అబ్బాయి,ఆ జమిందారులూ ఎంత పుణ్యాత్ములో కదా! దాదాపు ఇటువంటి కథ బెంగాలీ సాహిత్యంలో చదివినట్టు గుర్తు.
ప్రస్తుతం కాలం వైపరీత్యప్రభావంతో ఫ్యాన్సీదుకాణాలు పల్లెటూర్లో వాడవాడలా వెలిసాయి.గాజుల వారూ రావడం లేదూ,ఆసందడి లేదు.గతంగతః
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి