నృత్యము
కైలాస శైలాన కమనీయమౌరీతి
నగరాజ తనయతో నర్తనమ్ము
సంధ్యసమయంబున సాంద్రమౌరీతిగా
శీతాంశు కిరణాల చెలువ మొసగ
ధాతయే తథికిట తథికిటనుచును
తాళంబు సమకూర్చె తప్పకుండ
శృతులన్ని తామంత శృతిశ్రావ్యమౌరీతి
గమకమ్ము తప్పని గాత్ర మొసగె
దేవాది దేవుడే దేవేరి తోనంత
తాండవంబాడగా తన్మయంబు
మునులు దివిజు లెల్ల మౌనాంత రంగులై
మురసిరకట తాము మోద మంద
నటన సూత్రధారి నాట్యంబు వర్ణింప
మాటరాని వార మయ్య మనము
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి