అర్ధనారీశ్వరము

అర్ధనారీశ్వరులపరూప శిల్పంబు
అసదృశమైనట్టి యధ్భుతమ్ము
జగతిలో నీరీతి చాతుర్య  రచనమ్ము
కన్పట్టు మనకంత కావ్యమందు
కాళిదాసుమదిని కాంచినాడేమోను
భావించి నేమోను భాగ్యమట్లు
ఆధ్యాత్మ తత్త్వమే యాధార భూతమై
సాగించినట్టిదౌ శాస్త్ర మిదియె
నందీశు పైచేయి నగజాత కలశమ్ము
అర్ధనారీశ్వర యద్వైత తత్త్వంబు
కన్నుల ముందర కాంచ గలము
గజచర్మమొకవైపు కాంచన చేలమ్ము
ధరియించినట్టిదౌ దర్శనమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత