నాదాను సంధానము

నాదాను భూతియానందమందించగా
తాళంబు సమకూర్చు తన్మ యతను
లయయంతవిన్నంత లయమౌను మనసంత
పండిత వేద్యంబు పామర హృద్యంబు
మైమరపుకలుగ మాటలేల
శిశువైన నేమాయె పశువైన నేమాయె
పరవశంబౌటయె ప్రాతి పదిక
త్యాగయ్య కీర్తనే తన్మయతను గూర్చు
ముక్తి మార్గమునకు మొదటి మెట్టు
సంగీత జ్ఞానమ్ము సరియైన మార్గమ్ము
భక్తిసామ్రాజ్యంపు పథము చూపు
ఆ.వే.భావ రాగ లయల భవ్యమౌ మార్గమ్ము
ముక్తి పథముచూపు మొదటి యడుగు
ఆల పించి నంత యానంద లహరిలో
మునక వేయు వాడె ముక్తుడోయి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత