గాడ్ ఫాదర్ అను భగవంతుని ప్రణాళిక

సినినటులకు,రాజకీయనాయకులకు గాడ్ ఫాదర్స్ వుండి వారిని ఆపదలనుంచి గట్టెక్కింది, వారిని విజయతీరాలవరకు నడిపించినట్లే, చవటిదద్దమ్మలని ,పరమశుంఠలని, ఎందుకు పనికిరాని కొరకరాని కొయ్యలని ముద్రవేసి చెత్తబుట్టలో వేసిన అమాయక విద్యార్థులకు విధి వారిని గాడ్ ఫాదర్ లా రక్షించి కాపాడి,సాఫల్యాన్ని సమకూరుస్తుంది.ఈ గాడ్ ఫాదర్ ను విధి,డెస్టినీ అనో దేవుడనో అనే నీకిష్టమైన లేబిల్ తగిలించు.ప్రస్తుతం ఆ కర్తవ్యాన్ని గత రెండు సంవత్సరాలుగా కోవిడ్-19 విజయవంతంగా నిర్వహిస్తుంది.CBSE,10/ పరీక్షలను నుంచీ, సకల పరీక్షలనుంచి విద్యార్థుల పక్షాన నిర్వహించింది.
బాగా చదివే విద్యార్థుల పాలిట ఇది అశనీపాతమే, కానీ వారికి జరిగిన ఈ నష్టాన్ని వారి సమర్థత కారణంగా అధిగమించవచ్చు.
కానీ మూర్ఖులనే ముద్రపడిన విద్యార్థులకు లభించిన గొప్ప వరము కావచ్చు.ఈ పాస్ సర్టిఫికెట్లు వారి భవిష్యత్ విజయాలకు పాస్ పోర్టుల ఉపయోగపడుతుంది.ఫెయొల్ అనే అపజయ పరాభవమునుంచి బయట పడేస్తుంది."అయోగ్యో పురుషోనాస్తి"(పనికిరాని మనిషి యెవడు వుండడు) అనే సామెత వుండనే వున్నది. ఈ విద్యార్థులు తమ భావి జీవితంలో తమ అభిరుచికి తగిన రంగాల్లో ప్రతిభా పాటవాలు చూపవచ్చు.
కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే ప్రయోజకత్వానికి గీటురాయి కాదు
ఈ సోదెందుకంటారా! పాపం ! ఈ మధ్యసామాజిక మాధ్యమాల్లో వీరిపై సెటైర్లు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత