శ్రీరామా!
అవనినాదుకొనగ నచ్యుతా! రావయ్య
ఆశ్రయించితినిన్ను నన్యు లేల
జనులెల్ల నీపేరు జపియించు చుండిరి
జాగుసేయవలదు జాలి లేదె
మాధవుడేరక్షమనకునింకననచు
మనసులో నమ్మితి, మరువ దగునె
విశ్వంబు నీదయ్య విశ్వంబు నీవైన
విషయంబు మాకెల్ల విశదమాయె
ఆ.వె నీదు నామజపము నిత్యంబు మాకింక
దుఃఖ సమితి నంత తూల గొట్ట
ఆర్తినాశ నుండు హరియచ్యుడనుచు
వేదరాశియంత వెల్లడించె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి