కరోనా వైరస్సు

వైరస్సు కెప్పుడూ వైరాగ్య భావమే
తన వారు  పరులన్న తపన పడదు
ఆనలైనుచదువు నధ్వాన్న మైనను
ప్రత్యక్ష బోధన పడకవేయ
విద్యార్థి కిచ్చేను విలువైన విజయాన్ని
చల్లగా చూచెను చదువకున్న
ధనవంతుడైనను తగుపేదయైనను
తారతమ్యమొరుగని తపసిరీతి
కోవిడు పేరులో కోటిరీతులనుండు
కొంటెతనముచూపు కోతిరీతి
మూతిముసుగుతోడ మురిపించ కున్నచో
దావానలమువోలెదాపురించు
ఆరడుగులదవ్వునాపేయ కున్నచో
బ్రతుకంత బండగా మారునింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత