ప్రకృతి పర్యావరణము
ప్రకృతిచక్రగతిని వికృతిమార్చెననచు
భ్రాంతమందితిమేమొ భ్రమల మునిగి
వెలితిండినంతయు వెలివేయవలసెను
ఇంటితిండియిపుడు హితముగూర్చె
పనులకొరకుయింక బయటకెళ్ళకుండ
సాధ్యమౌకార్యంబు సదన మందు
ఇలలోన ధనమంత యింధనంబనుచు
మాటంత నేడేమొ మాటుమణిగె
ఆత్మీయబంధమ్ము నధికమౌ వరమాయె
మనసేమొ నేడాయె మందిరమ్ము
ఆ.వె.తాళమేసెనిటుల తానిట్లు ప్రకృతంత(lock down)
జగతి గతిని మార్చె సహజరీతి
బుధ్ధి తెచ్చుకొనిన పుడమేమొ నీదౌను
వరములొసగు నీకు వసుమతి యంతయు
నిర్ణయించు కొమ్ము నీదు దారి
మరుభూమి గా మార్చెను మానవుండు
భూమియె మాదంచు బూకరించు నరుడు
సర్వజీవులనెల్ల సంహరించి
వికటాట్టహాసంబు వికృతమౌరీతి
చేయగా జాలిన చెనటి వాడు
కడలినంతనరుడు కాలుష్య భరితమ్ము
కావించి చెడగొట్టు కఠిను డతడు
కాన లన్ని నేడు కాలుష్య భవనాలు
వృక్ష సమితి యంత వుసురు తీసె
సహజ వనురు లన్ని సర్వంబు ధ్వంసమ్ము
నరక లోక మాయె నరుని బ్రతుకు
[రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి]
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి