అమ్మనెట్లు పిలుతు

ఆవాహనమచేయ యసలేమి రాదమ్మ
సాగనంపువిధము సాధ్య మొట్లు
పూజించు విధమంత పూర్తిగా యెరుగను
అమ్మయనుచుపిల్తు నాదరాన
జగతికంతయునీవు జననివగుటచేత
నన్నుమరుతువంచు నాకు భయము
తల్లియెక్కడనుచు తల్లడిల్లుచునుందు
నిమిసమైననునేను నిలువగలనె
ఆ.వే అక్ష రమ్మురాని యల్పజ్గుడనునేను
జ్ఞాత మవ్యమంత జ్గాత పరచ
నీవె దిక్కు యనుచు నిరతమ్ము నమ్మితి
కావు వలయు నీవు కరుణ తోడ
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)
మంత్రశక్తిలేదు తంత్రశాస్ర మెరుగ
తపము చేయలేను జపము రాదు
అర్చనాదికంబు అసలురానెరాదు
అమ్మ యనుచు పిలుతుఆర్తి తోడ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత