జాతీయ భావన

జాతీయభావమే జాతీయవాదమ్ము
జాతిజనులకెల్ల జవమునొసగు
జాతీయవాదమే యతివాదమట్లుగా
జడిపించతగదోయి చవటలట్లు
వేలాది యేళ్ళుగా వేదాలు శాస్త్రాలు
విశ్వానికందించు విమల తలము
సంస్కృతీసభ్యతాసంస్కారములనెల్ల
భువనానికందించు పుణ్యభూమి
ఆ.వె.భాగ్యమనగ నాదె భలతాంబ బిడ్డను
అమ్మ వడినిబోలు యవనియిదియె
దేశభక్తితో డే దేహంబు ప్రాణులు
అర్పణంబు సేయ నాశ కలదు
(,రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత