శ్రీ రాచంద్రపరబ్రహ్మణేనమః
యుగము లెన్నొ గడిచె జగతిగతియుమారె
మానవ ధర్మంబు మారలేదు.
విపినవాసమనచు విసుగుపడనట్టీ
తనయుడున్నట్టి ధన్యభూమి
వాగర్థములరీతి వసుధలో నడయాడు
పతిపత్నులున్నట్టీ భాగ్యసీమ అన్నయే యఖిలంబు నాకంచు భావించు
తమ్ముడున్నట్టిదౌ ధరణిమనదె
శత్రువైన నేమి శరణు జొచ్చెననచు
క్షమియుంచునట్టి క్షాత్రభూమి
రాముడేలినట్టి రామరాజ్యమిదియె
కలగవలయు మనకు కరువు దీర
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి