కళ్యాణరాముడు
ఎన్నాళకెన్నాళకీరీతిరాముణ్ణి
దర్శించి నానయ్య ధన్యమతిగ
కళ్యాన రామునికమనీయరూపంబు
కళ్యాణదుర్గాన కాంచినాను
అట్టిదౌ భాగ్యంబుననుభవానికిపుడు
మరలకలిగెనాకు భావమందు
తనవేమొ పాల్వంచ తనమదినీచెంత
ధాతనిర్ణియమంత దాటగలమె
మాఘపౌర్ణిమిరోజు మధ్యాహ్న సమయాన
అరదంబునెక్కిన యధ్భుతమ్ము
ఆ.వె.మరలనొక్కమారు మదియంత పులకించె
పాత జ్ఞాపకములు పాతరంత
వెలకిదీసినట్లు వేలాది స్మృతులంత
కనులకట్టెనట్లు కానవచ్చె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి