చిత్తవృత్తి

భోజనాత్ త్పూర్వ భాగే చ భోజనాత్ పరత స్తథా 
క్షణే క్షణే మతిర్భిన్నా ధర్మస్య త్వరితా గతి:
అర్థము:--భోజనం చేయక ముందు వున్న బుద్ధి భోజనం చేసి సుఖంగా కూర్చున్నప్పుడు వుండదు. మానవుల చిత్తప్రవృత్తులు క్షణ క్షణానికి మారుతుంటాయి. కావున ఏ ధర్మకార్యమైనా చేయబుద్ధి పుట్టిన వెంటనే చేసెయ్యాలి. లేకుంటే బుద్ధి మారిపోయే ప్రమాదం వుంది. .
తినక ముందు బుధ్ధి తిన్నాక వుండునా
చిటిక లోన మారు చిత్త మెపుడు
ధర్మ మాచరించు తక్షణంబున నీవు
ఉన్న మాటయిదియె నులికి పడకు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత