భువనవిజయము
అల్లసాని కవియె నందమౌరీతిగా స్వారోచిషంబును సంతరించె
పూదండ మెడలోన పూర్తిగా ధరియించి
రంగవిభునకిచ్చె రక్తిమీర
చూడకొడుత్త నాంచారి చరిత యంత
రమ్యమౌరీతిగా రాసినట్టి
సాహిత్యమొకవైపు సంగరంబొకవైపు
రెండుపంటలరైతు రాయలనగ
ఆ.వే.రాయలేలినట్టిరతనాల సీమలో
కావ్యలతికలన్ని కాపుకాసె
శిల్పకళలకెల్ల శిఖరాయమానమౌ
భువన విజయ ఖ్యాతి పూర్ణ మాయె
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి