శ్రీశైలం మల్లన్న

శ్రీశైల నాథుండు శ్రీభ్రమరాంబతో
భక్తాళి నెల్లను బ్రోచు నెపుడు
శ్రీశైల శిఖరంబు శ్రీఘంబు గాజూచు
భక్తజనుల కింకి ముక్తి కలుగు
పాతళ గంగయె పావనత్వంబివ్వ
అఘరాశి యంతయు యంతమగును
ఇష్టకామేశ్వరీ యిష్టార్థమందివ్వ
మానుష జన్మంబు భద్రమగును
భక్త సులభుడతడు భవబంధములనెల్ల
భస్మరాశి చేయు భవ్యమూర్తి
మనసుతోననిచ్చు  మారేడుపత్రమైన 
ముదము మీరతాను నందుకొనును
(రచన:౼౼౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత