జాతీయ భధ్రతాదినోత్సవము
దేశభక్తియుతులు ధీరమతులువీరు
భరతమాతకొరకు ప్రాణ మొసగ
నడుముబిగించిన నవయోధవరులయ్య
వెన్నుచూపరెపుడు వైరికెపుడు
మలమాల మాడ్చెడు మరుభూమి యైనను
లెక్కచేయరెపుడు యెక్క డైన
ఊపిరందనియట్టి యున్నత గిరులెల్ల
ఎక్కకలిగినట్టి యోధులోయి
హిమపాత మెంతయో హింసించి బాధించ
సరుకుచేయరెపుడు సాహసాన
ఆ.వే. దేశ భక్తి కల్గి ధైర్యంబు తోతాము
వీర మరణమందు వీరు లెపుడు
పుడమిలోన మనకు పూజనీయులగుట
స్పూర్తి దాయ కంబు సుజను లార!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి