నాలోని భావాలు

నాలోని భావాలు నవ్యమౌ రాగాలునవనవోన్మేషమౌ నర్తనంబు
అందాలు చిందించు ఆత్మీయ గీతాలు
మరుమల్లె విరులెల్ల విరిసి నట్లు
చిత్రాలు శిల్పాలు చిందించు స్వగతాలు
గతజన్మ మర్మాలు గరపినట్లు
గగనాన తారకలు గళమెత్తియేమేనతెల్పునేమొ మనకంచు తలతు నేను
చిరునవ్వు చిందించు  చిన్నారి ఊఊలు 
మనకేమొ వివరించు పలుకులేమొ
మేఘమండలమంత మనతోడ మేలమాడ
కాంతికిరణుండు మనకేమొ భ్రాంతి ద్రుంచు
బాల్యమందలి భావాలు మతికి రాగ
వర్తమానంబు మనతోడ గొంతు కలిపె
రచన .గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత