ఆదిశంకరులు

ఆర్యాంబ శివగుర్వు యందాల బిడ్డడు
కాలటి గ్రామాన కాలుమోపె
వేదాలు శాస్త్రాలు వేటినీ వదలక 
గర్భాష్టమంబున గరచె నతడు
కరుణాంత రంగుడు కారుణ్య దృష్టితో
కనకధారనొసగి కలిమి నిచ్చె
పూర్ణాంత రంగుడు పూర్ణాస్రవంతిని
దారి మార్చి నాడు తల్లికొరకు
వేద ధర్మమంత వేద్యంబు సేయగా
దీక్ష పూని నట్టి ధీరుడతడు
తల్లిమదిని గెలిచి
సన్యాస దీక్షతో
వెడలి నాడు వాడు వేదమయుడు
రచన .గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత